EC Decision to Changing TRS to BRS: టీఆర్ఎస్ శ్రేణులకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త తెలిపింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు పార్టీ అధినేత సీఎం కేసిఆర్ కి అధికారికంగా లేఖ అందింది. కాగా శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు “భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అదే సమయానికి తనకు అందిన అధికారిక లేఖకు రిప్లై గా గులాబీ అధినేత సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుంది. అనంతరం సీఎం కేసిఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ముఖ్యమంత్రి కోరారు. వీరితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవన్ కు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తెలిపారు.
బిగ్ బ్రేకింగ్: సీఈసీ గ్రీన్ సిగ్నల్.. BRS గా మారిన TRS..
-