Croma offers Year End and festival Discounts: ఈ సంవత్సరాన్ని మరింత ఉత్సాహంగా క్రోమా యొక్క ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్, న్యూఇయర్ సేల్ వద్ద ముగించండి. భారతదేశంలో మొట్టమొదటి మరియు నమ్మకమైన ఓమ్నీ ఛానెల్ ఎలకా్ట్రనిక్స్ రిటైలర్, టాటా గ్రూప్‌కు చెందిన క్రోమా ఇప్పుడు అత్యంత ఉత్సాహపూరితమైన ఆఫర్లను గాడ్జెట్స్ మరియు అప్లయెన్సస్‌పై అందిస్తుంది. ఈ ఆఫర్లు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, హోమ్ అప్లయెన్సస్, టీవీలు మరియు మరెన్నో వాటిపై లభిస్తాయి. వినియోగదారుల షాపింగ్ కలలను ఇవి సాకారం చేస్తాయి. ఈ సేల్ స్టోర్ల తో పాటుగా క్రోమా డాట్ కామ్‌పై అత్యుత్తమ హాలీడే సీజన్‌గా చెప్పబడుతున్న జనవరి 02,2023 వరకూ లభ్యమవుతాయి.
సంతోషాన్ని కోరుకునే వారు వేడుక చేసుకోవడానికి అమితంగా ఇష్టపడే సందర్భాలు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ పండుగలు. సీక్రెట్శాంతా వేషధారణ మొదలు ప్రియమైన వారికి బహుమతులను కొనుగోలుచేయడం వరకూ విలువైన వినియోగదారుల హాలీడే కోరికలను భారీ డిస్కౌంట్లతో క్రోమా తీర్చేందుకు ప్రయత్నిస్తుంది. అదనంగా క్రోమా ఇప్పుడు మూడు బ్యాండ్స్‌ను పరిచయం చేసింది. రెడ్– 10% తగ్గింపు, గ్రీన్ – 5% తగ్గింపు, వైట్ – 3% రాయితీని స్టోర్ లోపల చేసే కొనుగోళ్లపై లక్కీ డ్రా విజేతలకు లభిస్తాయి. ఈ లక్కీ డ్రా బ్యాండ్స్‌ను రెండు దశలలో స్టోర్‌లో రిడీమ్ చేసుకోవచ్చు. మొదటి దశలో డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 25 మరియు రెండవ దశ డిసెంబర్ 31 నుంచి జనవరి 1, 2023 వరకూ ఉంటాయి.
సంవత్సరాంతాన్ని పురస్కరించుకుని క్రోమా(Croma Year end Discount) విస్తృత శ్రేణి ఆఫర్లను తీసుకువచ్చింది. ప్రియమైన వారికి స్మార్ట్‌ఫోన్ బహుమతిగా అందించడం లేదా తమ కోసం తాము స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి 5జీ స్మార్ట్‌ఫోన్12,999 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తుంది. అంతేకాదు,దీనికి అదనపు బొనాంజాగా 4999 రూపాయల విలువ కలిగిన స్మార్ట్‌వాచ్‌ను పూర్తి ఉచితంగా ఎంపిక చేసిన బ్రాండ్లపై అందిస్తారు. అప్‌గ్రేడ్ కోసం చూసే గేమింగ్ ప్రియుల కోసం 12వ తరపు ఇంటెల్ (ఆర్) గేమింగ్ ల్యాప్‌టాప్‌లు 54,990 రూపాయల ప్రారంభ ధరతో అందిస్తున్నారు. అదే సమయంలో బడ్జెట్ ల్యాప్‌టాప్ కోసం వెదికేవారికి ఇంటెల్ (ఆర్) కోర్ (టీఎం) ఐ3 ను 34990 రూపాయల ప్రారంభ ధరతో అందిస్తున్నారు.
వినియోగదరులు తమ ఇళ్లను మరింతగా మెరుగుపరుచుకునే అవకాశాలను అందిస్తూ సహాయపడుతుంది. దీనికోసం ప్రత్యేకంగా క్యూరేటెడ్ సీజన్ ఆఫరింగ్స్‌ను రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్స్, స్మార్ట్ఫోన్లు, ఇయర్ఫోన్లు, టెలివిజన్లు, హోమ్ అప్లయెన్సస్ మరియు మరెన్నో వాటిపై అందిస్తుంది. 4కె యుహెచ్డీ టీవీలు 990 రూపాయల నెలవారీ ఈఎంఐలతో లభిస్తే, ఎల్జీ ఓఎల్ఈడీలు 2990 రూపాయల ఈఎంఐలతో లభిస్తాయి. ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు 20,990 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తే, సైడ్ బై సైడ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీలు 34,990 రూపాయల ధరలో లభిస్తూ సంపూర్ణమైన షాపింగ్ అనుభవాలను వినియోగదారులకు అందిస్తాయి.
నూతన సంవత్సర వేళ మరింత ఉత్సాహాన్ని తీసుకువస్తూ, క్రోమా ఇప్పుడు 40% వరకూ రాయితీని అందిస్తుంది. అంతేకాక 5వేల రూపాయల వరకూ క్యాష్‌బ్యాక్‌ను ఏఎండీ గేమిగ్ ల్యాప్‌టాప్‌లపై అందిస్తుంది. అయితే ఈ ల్యాప్‌టాప్‌లను వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే స్టోర్లలో మానిటర్లు మరియు యాక్ససరీలు వంటి 14వేల రూపాయల వరకూ విలువైన వస్తువులను ఎంపిక చేసిన ఏఎండీ రైజెన్ ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై అందిస్తుంది.
వినియోగదారుల క్రిస్మస్, న్యూ ఇయర్ పార్టీలను దృష్టిలో పెట్టుకుని, క్రోమా ఇప్పుడు పార్టీ స్పీకర్లను కేవలం 2199 రూపాయల ప్రారంభ ధరతో అందిస్తున్నాయి. అంతేకాకుండా సౌండ్బార్లపై 80% వరకూ తగ్గింపు అందిస్తుంది. వీటన్నిటితో పాటుగా క్రోమా ఇప్పుడు ఈ హాలీడే సీజన్‌ను మరింతగా మెరుగుపరుస్తూనే, సంవత్సరాంతాన్ని మరింత మరుపురానిదిగా, విలువైన వినియోగదారులందరికీ అత్యంత ఉపయుక్తమైనదిగా మలుస్తుంది.
క్రోమా డాట్ కామ్‌పై అత్యుత్తమ డీల్స్ మరియు ఆఫర్లు ఈ ఇయర్ ఎండ్ సేల్‌లో పొందవచ్చు లేదంటే మీ దగ్గరలోని క్రోమా స్టోర్లను సందర్శించడం ద్వారా అత్యుత్తమ డీల్స్ పొందవచ్చు.
*All offers are subject to Terms & Conditions.