Raavi Venkateswara rao Reacts Over Petrol Attack On him in Gudivada: వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తే చంపేస్తామంటూ టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు కి బెదిరింపు కాల్స్ వచయన్న న్యూస్ ఏపీలో కలకలం రేపింది. ఈ వ్యవహారం గుడివాడ లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్య అనుచరుడే బెదిరింపులకు పాల్పడినట్టు రావి వర్గం ఆరోపిస్తుంది. కాగా ఈ ఘటనపై రావి వెంకటేశ్వరరావు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొడాలి నాని, ఆయన అనుచరులపై పలు ఆరోపణలు చేశారు.
కొడాలి నాని ప్రోద్బలంతోనే ఆయన ముఠా అరాచకాలు సృష్టిస్తోంది అన్నారు. సంఘవిద్రోహ శక్తులకు పోలీసులు అండగా నిలిచారని వాపోయారు. కత్తులు, పెట్రోల్‍తో వచ్చిన వారిని వదిలి మాపై లాఠీఛార్జ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వంగవీటి రంగా వర్ధంతి చేయవద్దని వైసీపీ నేతలు బెదిరించారు. రేపు రంగా వర్ధంతి జరుపుతాం.. దమ్ముంటే కొడాలి నాని ఆపుకోవచ్చు అంటూ సవాల్ విసిరారు. వైసీపీ నేతల దాడిపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు(Raavi Venkateswara rao).