Flawless Skin: నల్లటి మచ్చలకు, ముడతలకు చింతపండుతో చెక్ పెట్టండి

-

Alltimereport: Flawless Skin – పింపుల్స్, యాక్నే వంటి సమస్యల కారణంగా ఏర్పడిన నల్లటి మచ్చలు అంత ఈజీగా పోవు. ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలని కూడా వేధించే అతి పెద్ద సమస్య. కొంతమందికి ఈ సమస్య మరింత పెద్దదిగా ఉంటుంది. దీంతో బయటకు వెళ్లాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నల్లటి మచ్చలు చర్మంలో కలవాలంటే చాలా సమయం పడుతుంది. వీటిని తొలగించడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఒక్కోసారి అవి పని చేసినప్పటికీ.. వాటిలో ఉండే కెమికల్స్ చర్మానికి హాని చేసే ప్రమాదం ఉంది.

- Advertisement -

అయితే ఈ నల్లటి మచ్చలకు ఇంట్లో ఉండే పదార్థాలతోనే చెప్పొచ్చు అంటున్నారు మన పెద్దలు. మన బామ్మలు వాడిన చిట్కా చాలా బాగా పనిచేస్తుందట. అదేంటో ఇప్పుడే తెలుసుకుందాం. సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగిఉన్న చింతపండు ఆరోగ్య పరంగానే కాకుండా చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడనుంది. 1. చింతపండు రసాన్ని ముఖానికి రాసుకుని కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. 2. చింతపండు, పాలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేసుకుని ముఖానికి రాసుకోవాలి. తర్వాత నీటితో కడిగితే చర్మంపై నలమచ్చలతో పాటు ముడతలు(Flawless Skin) పోతాయి. ఇలా వారానికి రెండుసార్లు ట్రై చేస్తే ప్రయోజనం ఉంటుంది.

గమనిక: చింతపండు మీ చర్మ తత్వానికి పడుతుందో లేదో ముందే టెస్ట్ చేసుకోండి. చింతపండు ఎలర్జీ ఉన్నవాళ్లు ట్రై చేయకండి. ముందుగా టిప్స్ లో చెప్పిన చింతపండు మిశ్రమాన్ని మీ చేతిపై కొద్దిగా రాసుకుని ఒక ఐదు నిముషాలు ఉంచండి. ఎలాంటి దద్దుర్లు, దురద, మంట లేకపోతే ముఖంపై అప్లై చేయండి. వీటిలో ఏ లక్షణాలు ఉన్నా వాడకండి.
Read Also:
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ వేడుకలపై కీలక నిర్ణయం!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...