సిఎం మాజీ సిఎంలపై సుజనా సంచలన కామెంట్స్

సిఎం మాజీ సిఎంలపై సుజనా సంచలన కామెంట్స్

0
149

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లోపడిన ఓట్లకంటే ఫిర్యాదులే ఎక్కువ వచ్చాయా అంటే అవుననే అంటున్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తాజాగా ఆయన నందిగామ మండలంలో గాంధీ సంకల్పయాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రస్తుతం టీడీపీ నాయకులు జగన్ ను టార్గెట్ చేయడానికి బదులు రాష్ట్ర సమస్యలపై పోరాడాలని సలహా ఇచ్చారు సుజనా…

ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో కులమతాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు… జగన్ రాజ్యంగానికి అతీతులం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. ఏపీలో బీజేపీ బలపడుతోందని అన్నారు…