AP govt Reduces Security of MLA Anam Ramanarayana Reddy: నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి కి షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. ఆయన భద్రత సిబ్బందిని కుదించారు. ఆనంద్ సెక్యూరిటీ సిబ్బందిని నలుగురి నుంచి ఇద్దరికి తగ్గించారు. కాగా భద్రత కుదింపు పై స్పందించిన ఆనం.. ప్రభుత్వ నిర్ణయం పై సీరియస్ అయ్యారు. ఈ విషయంపై తనకు లిఖితపూర్వక లేఖ ఇవ్వాలని పోలీసులను కోరారు. వెంకటగిరి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమని, ఎర్రచందనం మాఫియా ఎక్కువగా ఉందని సూచించారు. భద్రత తగ్గిస్తే ప్రాణాలకు ముప్పు ఉంటుందని చెప్పారు. ఆనం ప్రజల్లో తిరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. కాగా ప్రభుత్వంపై గత కొంతకాలంగా ఆనం విమర్శలు చేస్తున్నారు. తమ ప్రభుత్వ పాలన ప్రజాస్వామికంగా లేదంటూ అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆనంద్ రాంనారాయణ రెడ్డి(Anam Ramanarayana Reddy) భద్రత కుదిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సొంత ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన వైసీపీ అధిష్టానం
-