Nizam Mukarram jah: 8 వ నిజాం ముక్రం జా పార్థివ దేహానికి చౌ మహల్ ప్యాలెస్ లో సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం రేపు ఉదయం 8 గంటల నుండి 3 గంటల వరకు ప్యాలెస్ లోకి అనుమతించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం ముక్రం జా చివరి కోరిక మేరకు హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మక్కా మసీద్ లో నిజాం వంశీకుల సమాధుల పక్కన అంత్యక్రియలు జరగనున్నాయి. మీరు అలీఖాన్ ముక్రం జా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు(89).. ఆయన శనివారం టర్కీ లోని ఇస్తాంబుల్ లో తుది శ్వాస విడిచారు.