Upasana- Ram Charan: ఉపాసన రామ్ చరణ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాసన నాయనమ్మ పుష్పాణి కామినేని కన్నుమూశారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె పంచిన ప్రేమానురాగాలని ఎన్నటికీ మర్చిపోనని, తన పిల్లలకి ఆ అనురాగాన్ని పంచుతానని చెప్పుకొచ్చారు. “చివరి వరకు కృతజ్ఞత, ప్రేమ, గౌరవం, సానుభూతి భావజాలంతో తన జీవితాన్ని కొనసాగించింది. ఆమె జీవితం నుండి నేను ఎన్నో నేర్చుకున్నాను. పుష్పాణి నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె పంచిన ప్రేమను నేను ఎన్నటికీ మరువలేను. నేను నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి ప్రేమానురాగాలను పొందానో.. ఆ అనుభూతులన్నింటినీ నా పిల్లలకు అందేలా చూస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ భావోద్వేగ నోట్ తో పాటు తన నాయనమ్మతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది ఉపాసన.