Jagga Reddy – Revanth Reddy: ప్రగతి భవన్ ను కూల్చేస్తామంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజేశాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి(JaggaReddy) తప్పుబట్టారు. ప్రగతి భవన్ ను కూల్చేస్తా అనడం తప్పేనని జగ్గారెడ్డి అన్నారు. కూల్చివేతలు కాంగ్రెస్ విధానం కాదని స్పష్టం చేశారు. పాదయాత్రలు ఎవరైనా చేయవచ్చని అన్నారు. రేవంత్ తిరుగుతానంటున్నాడు.. తిరగనిద్దామని అన్నారు అంటూ ఎద్దేవా చేశారు. తనను ఎవరైనా పాదయాత్రకు పిలిస్తే వెళతానని ప్రకటించారు.