ప్రియాంక గాంధీ పీఏ సందీప్‌పై కేసు నమోదు

-

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పర్సనల్ సెక్రటరీ సందీప్ సింగ్‌పై ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో కేసు నమోదయ్యింది. బిగ్ బాస్ -16 ఫైనలిస్ట్ అయిన అర్చనా గౌతం తండ్రి గౌతం బుద్ధా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సందీప్ సింగ్ తన కూతురిని కులం పేరుతో దూషించటమే కాకుండా చంపుతానని బెదిరించినట్టు గౌతం బుద్ధా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

‘‘ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఆహ్వానంపై కాంగ్రెస్ జనరల్ కన్వెన్షన్‌లో పాల్గొనేందుకు సందీప్ సింగ్ ఫిబ్రవరి 26న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు నా కుమార్తె అర్చన గౌతమ్‌ను పిలిచారు. నా కుమార్తె ప్రియాంక గాంధీతో అపాయింట్‌మెంట్ కోరింది. కానీ అతడు నిరాకరించాడు. నా కుమార్తెతో అనుచితంగా ప్రవర్తించాడు. కులతత్వంతో అసభ్య పదజాలంతో దూషించి, నా కుమార్తెని కించపరిచి, సమావేశ వేదికపై అందరి ఎదుటే చంపేస్తానని బెదిరించాడు. దానికి సంబంధించిన వీడియో రుజువు అక్కడ ఉన్న కెమెరామెన్ వద్ద లభ్యమైంది’’ అని గౌతమ్ బుద్ద పోలీసులకు తెలియజేశారు.

Read Also: సర్కార్ శుభవార్త.. గోవా వెళ్లాలనుకుంటున్నారా..?

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...