RC 15 |గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తో్న్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నా్యి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ నటించిన ఫుల్ లెంగ్త్ మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ హై రేంజ్‌లో ఉన్నాయి. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ ఒక పొలిటికల్ డ్రామా అని తెలుస్తుండగా.. అప్‌డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు. RC15 నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్‌పై అప్‌డేట్ ఇచ్చారు. మార్చి 28న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేయనున్నట్లు దిల్ రాజు వెల్లడించారు. దీంతో చరణ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Read Also: ఆ క్షణం మా గుండెల్లో మా దేశాన్ని మోస్తున్నట్లే భావిస్తాం: NTR
Follow us on: Google News