మాకు జగన్ వద్దు బాబేకావాలంటున్న జనం

మాకు జగన్ వద్దు బాబేకావాలంటున్న జనం

0
76

మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దు అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు… ఒక్క అవకాశం ఇవ్వండని చెప్పినందుకు వైసీపీకి ఓట్లు వేశామని తాము ఇప్పుడు మోసపోయామని జనం అంటున్నారట…

ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు… ప్రజలందరు జగన్ ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నారని చెప్పారు… మళ్లీ తానే రావాలని కోరుకుంటున్నారని తెలిపారు… ఒక్క అవకాశం ఇస్తే జగన్ ఏదో చేస్తాడని ఆశలు పెట్టుకున్నారని కానీ వారి ఆశలను జగన్ నిరాశ చేశారని అన్నారు…

ఇచ్చిన హామీలు సైతం అమలు చేయకుండా నవరత్నాలను నవగ్రహాలుగా మార్చారని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు… ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించే సామర్థ్యం జగన్ కు లేదని అన్నారు