Hyderabad |వేసవి కాలం వచ్చిదంటే చాలు అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తీవ్రతరమవుతుంటాయి. కొన్నిచోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండి సమస్యలు రాకుండా చూస్తే.. మరికొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో హైదరాబాద్(Hyderabad) నగర ప్రజలకు జలమండలి అధికారులు శుభవార్త చెప్పారు. రానున్న ఎండాకాలంలో నగరంలో ఎటువంటి నీటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని హైదరాబాద్ జలమండలి తెలిపింది. నగరంతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఢోకా లేదని, అవసరం మేరకు తాగునీరు అందుబాటులో ఉందని తెలిపారు. జలమండలి ప్రస్తుతం రోజూ 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుందని, మరో 42 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నగరంతో పాటు ఓఆర్ఆర్ లోపలి గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
Read Also: రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
Follow us on: Google News