లోక్‌సభలో తనపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. తాను భారత దేశ స్వరం కోసం పోరాడుతున్నట్లు ప్రకటించారు. ఇలాంటి వాటికి తానేం భయపడనని, ఏ త్యాగానికైనా సిద్ధమని అన్నారు. కాగా, 2019లో కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ(Modi) ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో ఇటీవల గుజరాత్‌లోని సూరత్ హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి రెండేండ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని అనర్హత వేటు వేసినట్లు ఆ ప్రకటనలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1) (ఈ)తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం అనర్హత వేటు వేసినట్లు తెలిపారు. కేరళలోని వయానాడ్ లోక్‌సభ్యుడిగా ఉన్న ఆయనపై అనర్హత వేటు వేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నది.
Read Also: రాహుల్ అనర్హత వేటును ఖండించిన సీఎం కేసీఆర్
Follow us on: Google News Koo Twitter