రాహుల్ కంటే ముందు అనర్హత వేటుపడిన పొలిటీషియన్స్ వీళ్లే..!

-

Rahul Gandhi |లోక్‌సభలో రాహుల్ గాంధీ అనర్హత వేటు వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిని కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర చర్చ విస్తృతమైంది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) కంటే ముందే లోక్‌సభలో అనర్హత వేటుకు గురైన నేతల వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

– తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత 2017లో అనర్హతకు గురయ్యారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 4 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా పడింది. దీంతో ఎమ్మెల్యే పదవికి అనర్హతకు గురయ్యి సీఎం పదవి నుంచి దిగిపోయారు. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు ఆమెను నిర్ధోషిగా ప్రకటించడంతో అవరోధాలన్నీ తొలగిపోయాయి.

– బిహార్‌లోని సరన్ ఎంపీగా ఉన్నప్పుడు ‌ఆర్‌జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్‌లో 2013 సెప్టెంబర్‌లో అనర్హత వేటు పడింది. దాణా కేసులో 5 ఏళ్ల జైలుశిక్షపడడం ఇందుకు కారణమైంది.

– లక్షద్వీప్ మాజీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ ఈ ఏడాది జనవరి 23న డిస్‌క్వాలిఫై అయ్యారు. హత్యాయత్నం కేసులో అతడిని సెషన్స్ కోర్ట్ దోషిగా తేల్చడం, రెండేళ్లకుమించి జైలుశిక్షపడడం ఇందుకు కారణమైంది.

– రామ్‌పూర్ మాజీ ఎంపీ ఆజం ఖాన్ 2019లో విద్వేష ప్రసంగం కేసులో దోషిగా తేలారు. రెండేళ్లకంటే ఎక్కువ జైలుశిక్షపడడంతో అనర్హత వేటుపడింది.

Read Also: అనర్హత వేటుపై రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే

Follow us on: Google News  Koo Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...