UPI Payments |ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా లావాదేవీలు జరిపే వారికి కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై యూపీఐ ద్వారా కొన్ని రకాల చెల్లింపులపై ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రీపెయిడ్ సాధనాలైన వ్యాలెట్లు లేదా కార్డుల ద్వారా యూపీఐ(UPI Payments) విధానంలో చేపట్టే వ్యాపార లావాదేవీలకు 1.1 శాతం ఛార్జీ తీసుకోనున్నారు. ఆన్‌లైన్ మర్చంట్స్, పెద్ద మర్చంట్స్, చిన్నపాటి ఆఫ్‌లైన్ మర్చంట్ల వద్ద చేసే రూ.2000కు పైగా విలువైన లావాదేవీలపై 1.1 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు తీసుకుంటారు. ప్రీపెయిడ్ సాధనాలను జారీ చేసినవారు డబ్బులు డిపాజిట్ అయిన బ్యాంకుకు 15 బేసిస్ పాయింట్ల మేర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా అవతలి పేమెంట్ బ్యాంకు నుంచి వీరికి వస్తే 15 బేసిస్ పాయింట్ల మేర ఫీజు వస్తుంది. సాధారణంగా కార్డు పేమెంట్ల అంగీకారం, ప్రాసెసింగ్, ఆథరైజింగ్ లావాదేవీల ఖర్చులు రాబట్టేందుకు ఇలా ఇంటర్ ఛేంజ్ ఫీజు తీసుకుంటారు.
Read Also: ‘శ్రీరామనవమిలోపు పినాయిల్‌తో కేటీఆర్ నోరు కడుక్కోవాలి’
Follow us on: Google News, Koo, Twitter