శ్రీరామనవమి సందర్భంగా మందుబాబులకు హైదరాబాద్(Hyderabad) పోలీసులు అనూహ్య షాకిచ్చారు. మార్చి 30వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్‌లు, పబ్‌లు, ఫైవ్ స్టార్ హోటళ్లలోని బార్ రూమ్‌లను మూసివేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మార్చి 31 ఉదయం 6 గంటల వరకు ఆయా మద్యం షాపులు అన్ని బంద్ కానున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ ఆదేశాలు జారీ చేశామని పోలీసులు తెలిపారు. అటు బ్లాక్ మార్కెట్‌లో మద్యం అమ్మేవారిపై నిఘా పోలీసులు ఉంచనున్నారు. మరోవైపు శ్రీరామనవమి శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరమంతా బలగాలను మోహరించనున్నారు.
Read Also: హైదరాబాద్‌కు ఆ అర్హత లేదనడం విడ్డూరంగా ఉంది: KTR
Follow us on: Google News, Koo, Twitter