Indore StepWell |పండగపూట మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇండోర్‌లోని మహాదేవ్ మందిర్‌లో పైకప్పు కూలి బావిలో పడి ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇండోర్(Indore)లోని బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో శ్రీరామనవమి రోజున ఈ భారీ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. 40 అడుగుల లోతున్న మెట్ల బావిలో 25 మంది పడిపోయారు. పోలీసులు 18 మందిని తాళ్లతో బయటకు తీశారు. వీరిలో ఇద్దరు బాలికలు కాగా, ఆరుగురు మహిళలు ఉన్నారు. మరికొంత మంది చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. మెట్టబావిలో నాలుగైదు అడుగుల నీరు ఉంది. ప్రమాదానికి ముందు మెట్ల బావి డాబాపై 25 మందికి పైగా కూర్చున్నారు. దీంతో అధిక బరువై పైకప్పు విరిగిపోయి ప్రజలు పడిపోయారని అంటున్నారు. ఈ దేవాలయం సుమారు 60 సంవత్సరాల నాటిదని చెప్పుకొచ్చారు.
Read Also: సెక్స్ తర్వాత ఇలా చేస్తే మీ పార్ట్ నర్ హర్ట్ అయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త..!
Follow us on: Google News, Koo, Twitter