ప్రధాని నరేంద్ర మోడీ(Modi)కి సంబంధించిన డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లు కావాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు రూ.25వేల ఫైన్ విధించింది. ప్రధాని మోడీకి చెందిన డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికేట్లను ప్రధానమంత్రి కార్యాలయం(PMO) బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది. జస్టిస్ బీరెన్ వైష్ణవ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. గుజరాత్ యూనివర్సిటీతో పాటు ఢిల్లీ యూనివర్సిటీలు ప్రధాని మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లను సమర్పించాలని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సింగిల్ జడ్జి బెంచ్ కొట్టిపారేసింది.
Read Also: ఈసారి సమంత పేరు ప్రస్తావించిన రేవంత్.. కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter