ఈసారి సమంత పేరు ప్రస్తావించిన రేవంత్.. కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy

మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వంద కోట్లు ఇస్తే కేటీఆర్‌ను ఏమైనా తిట్టొచ్చా? అని ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రేవంత్​రెడ్డి తన పరువు వంద కోట్ల రూపాయలని కేటీఆర్ ​ఎలా నిర్ధారణకు వచ్చారని ప్రశ్నించారు. ఇదేమైనా రకుల్ ప్రీత్​సింగ్​ సినిమాకు సంతకం చేసినట్లా? లేక సమంత సిరీస్‌కు సంతకం పెట్టినట్లా? అని వ్యాఖ్యానించారు. దమ్ముంటే టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్​చేశారు. కాగా, టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy), బండి సంజయ్‌(Bandi Sanjay)లకు కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వెంటనే ఇద్దరు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే రూ.100 కోట్ల పరువునష్టం దావా(Defamation Suit) ఎదుర్కోవాల్సి ఉంటుందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. దానికి స్పందించిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు.

Read Also: తప్పదు అనుకుంటే వారితో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం: జానారెడ్డి

Follow us on: Google News, Koo, Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here