తెలంగాణ బీజేపీలో ఫేక్ డాక్టర్లు ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా

-

తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. వరుస పేపర్ లీకులతో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు దారులు వెతుకుంటోంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్(KTR) బీజేపీ నేతలపై ఫేక్ డిగ్రీస్ అంటూ విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు చాలా మంది ఉన్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు ఫేక్ డిగ్రీలతో ఉన్నారని.. రాజస్థాన్, తమిళనాడు యూనివర్సిటీల్లో చదివినట్లు తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం కాదా? అని ప్రశ్నించారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా వారి విద్యార్హత సర్టిఫికేట్లను పరిశీలించి ఆ ఇద్దరు ఎంపీలపై అనర్హత వేటు వేయగలరా? అని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. కాగా ఓవైపు ప్రధాని మోదీ డిగ్రీ అర్హత పత్రాలపై పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. మోదీ డిగ్రీ పత్రాలు కావాలని అడిగిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు గుజరాత్ కోర్టు రూ.25వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Read Also: మహేంద్రుడికి కోపం వచ్చింది.. చెన్నై బౌలర్లకు స్వీట్ వార్నింగ్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...