Hyderabad |రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. మంగళవారం ఉదయం బెంగుళూరు నుండి వారణాసికి బయలుదేరిన ఇండిగో 6E897 విమానంలో కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని గమనించిన పైలెట్ అప్రమత్తమై శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం 6.15 గంటలకు అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఇండిగో విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని విమానానికి మరమత్తులు చేపట్టారు. కాసేపట్లో ఇండిగో విమానం తిరిగి వారానాసికి బయలుదేరి వెళ్లనుంది. కాగా, విమానంలో మొత్తం 137 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని డీజీసీఏ తెలిపింది.
Read Also: టెన్త్ విద్యా్ర్థుల జవాబు పత్రాలు మాయం.. రంగంలోకి కలెక్టర్
Follow us on: Google News, Koo, Twitter