‘తెలంగాణలో పరీక్షలు వస్తే ప్రశ్నాపత్రాల లీకేజీల జాతర’

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి తెలుగు ప్రశ్న పత్రం లికేజీ కావడం అత్యంత దురదృష్టకరం. కేసీఆర్(KCR) ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తొంది. తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోంది. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటు. ప్రభుత్వ చేతగానితనం విద్యార్థుల జీవితాలకు శాపంగా మారింది.

- Advertisement -

కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. పేపర్ లికేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. ఈ లికేజ్ ఘటనతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. మిగిలిన పరీక్షలైనా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ లీకేజీ వెనకాల ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దు. బాధ్యులైనా వారందరినీ కఠినంగా శిక్షించాలి.’’ అని సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు.

Read Also:  తెలంగాణ బీజేపీలో ఫేక్ డాక్టర్లు ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...