కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు…

కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు...

0
96

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా మేస్త్రీ బ్రహ్మాజీ వెంకట్రావుల ఆత్మహత్యలపై చంద్రబాబు స్పందించారు… పండుగ వేళ భవన నిర్మాణరంగానికి చెందిన మేస్త్రీలు బ్రహ్మాజీ, వెంకట్రావుల ఆత్మహత్య వార్తలు తనను కలిచివేశాయని అన్నారు.

ఇసుక కొరతతో పనుల్లేక కార్మికులు బలవన్మరణం పాలు కావడం ఆవేదనకు గురిచేస్తోందని చంద్రబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ పార్టీ నేతల జేబులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఎద్దేవా చేశారు.

జీవితం ఎంతో విలువైనది, పోరాడి సాధించాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఇంకెవరూ తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండని చంద్రబాబు సలహాలు ఇచ్చారు. మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంది. నేను ఉన్నాను. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడుదాం. ఇసుక అక్రమాలపై నిలదీద్దామని అన్నారు.