HYD: టీఎస్‌పీఎస్‌సీ కేసులో హైకోర్టుకు చేరిన సిట్ నివేదిక

-

TSPSC Paper Leak |టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సృష్టించిన దుమారం అంతా ఇంతా కాదు. దీనిపై అధికార, విపక్షాలు వ్యక్తగత దూషణలకు సైతం దిగాయి. తాజాగా.. ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒక సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు నివేదిక సమర్పించింది. దర్యాప్తు పాదర్శకంగా జరుగుతూ ఉన్నదని, ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ స్పష్టం చేశారు.

- Advertisement -

TSPSC Paper Leak |ఈ కేసులో మొత్తం 18 మందిని నిందితులుగా గుర్తించామని, ఇందులో ఒక్కరిని మినహా మిగిలిన 17 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఆ ఒక్కరు న్యూజిలాండ్‌లో ఉన్నందున అరెస్టు చేయలేదని, ఇక్కడకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుని లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు పారదర్శకంగా జరగడంలేదని, అందువల్లే సీబీఐ(CBI)కి అప్పగించాలని కోర్టును కోరుతున్నామన్నారు. సీల్డ్ కవర్ నివేదికను పరిశీలించిన తర్వాత విచారణ ప్రారంభమవుతుందని పేర్కొన్న బెంచ్ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

Read Also: ‘అసెంబ్లీ నీ అబ్బ సొత్తు కాదు’.. పొంగులేటిపై వద్దిరాజు సీరియస్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...