ఖమ్మం(Khammam) జిల్లా వైరా నియోజకవర్గం, చీమలపాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా కలుస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగసిపడి పక్కనే ఉన్న పూరి గుడిసెను అంటుకున్నాయి. గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్(KCR), మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) తీవ్ర దిగ్భ్రాంతి చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షలు, పూర్తిగా ఉచిత వైద్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఖమ్మం(Khammam) జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar) ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయి లో అన్ని విధాలుగా వైద్య చికిత్సలు అందిస్తామని మంత్రి ప్రకటించారు.