తెలంగాణ కాంగ్రెస్ కు మహేశ్వర్ రెడ్డి గుడ్ బై?

-

తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి సీనియర్ నేతల అసంతృప్తి బయటపడింది. అయితే ఈసారి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీరుపై ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు. రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్ నేతలను ఏకం చేసేందుకు కూడా ప్రయత్నించారు. రేవంత్ పాదయాత్ర చేయడంతో ఆయనకు పోటీగా మహేశ్వర్ రెడ్డి కూడా పాదయాత్ర చేపట్టారు.

- Advertisement -

అయితే పార్టీ అధిష్టానం పాదయాత్ర మధ్యలోనే ఆపేయాలని ఆదేశించింది. దీంతో ఆయన అసంతృప్తి మరింత ఎక్కువైంది. ఈ క్రమంలోనే ఆయన కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నేడు కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయన పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) బీజేపీ(BJP)లో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు మూడు రోజుల్లోనే ఆయన కాషాయం కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండిస్తున్నారు. తనపై ఎవరో కావాలనే పార్టీ మారతానని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Read Also: ఆస్పత్రిలో చేరిన టీకాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...