తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి(Jana Reddy) సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. మంగళవారం మోకాలి నొప్పి కారణంగా ఆస్పత్రికి వెళ్లిన జానారెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన గుండెలోని ఓ రక్తనాళం పూడ్చుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే ఆయన గుండెకు స్టంట్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు సమాచారం. జానారెడ్డి ఆరోగ్యంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరాతీస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కాగా ఎంతో సౌమ్యుడిగా పేరుగడించిన ఆయన ఇటీవల బీఆర్ఎస్ తో పొత్తుపై ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపాయి.
Read Also: TSPSC కేసులో ఆ ఇద్దరు అధికారులకు ఈడీ నోటీసులు
Follow us on: Google News, Koo, Twitter