Telangana |తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలపై ముగ్గురు సీనియర్ అధికారుల బృందం శనివారం సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వాహణపై చర్చించి, అధికారులకు శిక్షణ ఇచ్చారు. అంతేగాకుండా.. పోలింగ్ శాతాన్ని పెంచే కార్యక్రమాలపైనా సమీక్షించారు. డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలో వచ్చిన బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈవీఎంల సన్నద్ధత, ఇతర అంశాలపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలో చేర్పులను నిరంతరం పర్యవేక్షించాలని, ఆర్వోలు మే 1 నుంచి ఈవీఎంలను తనిఖీ చేయాలని ఈసీ ఆదేశించింది. జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు రెండ్రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించాలని సూచించారు.
Read Also: CRPF కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. తెలుగులో ఎగ్జామ్
Follow us on: Google News, Koo, Twitter