వివేకా హత్య కేసు.. తాడేపల్లి ప్యాలెస్ లో పెద్ద చేపలు

-

వివేకా హత్య కేసులో సీఎం జగన్ మరో బాబాయ్ భాస్కర్ రెడ్డి(YS Bhaskar Reddy) అరెస్ట్ కావడంపై టీడీపీ నేతలు స్పందించారు. ఈ కేసులో భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి(YS Avinash Reddy) చిన్న చేపలు మాత్రమేనని.. పెద్ద చేపలు తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నాయని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి(Btech Ravi) ఆరోపించారు. భాస్కర్ రెడ్డి అరెస్టుతో నాలుగేళ్లుగా వివేకా కుమార్తె సునీత(Sunitha) చేస్తున్న పోరాటానికి కొంత న్యాయం జరిగిందన్నారు. అసలు నిందితులు కూడా అరెస్ట్ అయితే ఆమెకు పూర్తి న్యాయం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

ఈ కేసులో భాస్కర్ రెడ్డి(YS Bhaskar Reddy) అరెస్టుతోనే సీబీఐ అధికారుల అరెస్టులు ఆగవని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. తాడేపల్లిలో ఉన్న చివరి వ్యక్తి వరకు ఈ అరెస్టులు వెళ్తాయని ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం సొంత కుటుంబసభ్యులే వివేకానందరెడ్డిని చంపడం బాధాకరమన్నారు. ఏ తప్పు చేయనప్పుడు వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు పూర్తి అయితే అసలు నిందితులు తప్పకుండా దొరుకుతారని అఖిలప్రియ వెల్లడించారు.

Read Also: వైఎస్ భాస్కర్ రెడ్డిని అందుకే అరెస్ట్ చేశాం: సీబీఐ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...

Ravanth Reddy | ‘ఢిల్లీకి ఎన్ని సార్లైనా వెళ్తా.. ఈరోజు అందుకే వెళ్తున్నా’

తన ఢిల్లీ పర్యటనలపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చలపై సీఎం రేవంత్ రెడ్డి(Ravanth...