ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్(Arjun Tendulkar) అరుదైన ఘనత సాధించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(MI) 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐపీఎల్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి కల నెరవేర్చుకున్న అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్ వేసిన అర్జున్ పొదుపుగానే పరుగులు ఇచ్చాడు. అయితే, రెండో ఓవర్‌లో కాస్తన్ని ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. రెండు ఓవర్లు మాత్రమే వేసిన జూనియర్ టెండూల్కర్ 17 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్‌లో నిజానికి బెస్ట్ ఫిగర్సే. అర్జున్ మైదానంలో అడుగుపెడుతూనే అత్యంత అరుదైన రికార్డును తనపేర రాసుకున్నాడు. తండ్రి తర్వాత కుమారుడు కూడా అదే ఫ్రాంచైజీకి ఆడడం ఐపీఎల్(IPL) చరిత్రలో ఇదే తొలిసారి. ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన తండ్రీ కొడుకులుగా సచిన్, అర్జున్ రికార్డులకెక్కారు.
Read Also: పెళ్లిమీద నమ్మకం లేదు.. డేటింగ్‌తోనే కంటిన్యూ అవుతా: శృతి హాసన్
Follow us on: Google News, Koo, Twitter