Gun Firing |తెలంగాణలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కరీనంగర్ జిల్లా మానకొండూరులో బుధవారం అర్థరాత్రి నాలుగు రౌడీషీటర్లు బీభత్సం సృష్టించారు. అరుణ్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతనని చితకబాదారు. పారిపోతున్న క్రమంలో తుపాకీతో కాల్చారు. అయితే ఆ బుల్లెట్ తగలకపోవడంతో ఆయన పక్కనే ఉన్న ఓ ఇంట్లో దాక్కున్నాడు. అయినా కానీ ఆ దుండగులు ఆ ఇంట్లోకి ప్రవేశించి వారింట్లోని సామాన్లు ధ్వంసం చేసి వారిని బెదిరించారు.
స్థానికులు అడ్డుకోబోగా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నలుగురు అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరిని పోలీసులు పట్టుకోగా.. మరో ఇద్దరు పారిపోయారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని తప్పించుకున్న ఆ ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. అరుణ్ తో ఉన్న పాత కక్షలే కాల్పులకు కారణమని పోలీసులు తెలిపారు. అర్థరాత్రి పూట కాల్పులు(Gun Firing) జరగడంతో మానుకొండూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Read Also: భాగ్యనగరంలో ఈ ప్రాంతాల్లోనే డబుల్ డెక్కర్ బస్సుల ప్రయాణం
Follow us on: Google News, Koo, Twitter