ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈసారి ముందుగానే రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలో అప్పుడే ఎలక్షన్ వాతావరణం కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) ఇంట్లో కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు మాజీ ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షట్కర్, ఇతర నేతలు హాజరయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై నేతలు చర్చించారు. ఈ మధ్యే బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ వేటు వేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy)పైనా కాంగ్రెస్ నాయకులు చర్చించారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేలా రేణుకాచౌదరి చొరవ చూపాలని పార్టీ నాయకులు కోరారు.
Read Also: రాహుల్ గాంధీకి మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ.. అరెస్ట్ తప్పదా?
Follow us on: Google News, Koo, Twitter