చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో గోపిచంద్, తనకు రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడినే ఈసారి నమ్ముకున్నాడు. శ్రీవాస్, గోపి కాంబినేషన్లో ఇది వరకు వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా రామబాణం(Rama Banam) మూవీ తెరకెక్కింది. మే 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో జగపతిబాబు తమ్ముడిగా గోపిచంద్ నటిస్తున్నాడు. యాక్షన్ అండ్ కామెడీ మూవీగా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇందులో గోపిచంద్ చెప్పిన పవర్ పుల్ డైలాగ్ సినిమాకే హైలెట్ గా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. కాగా ఈ సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొడతున్నామని గోపి ఆశాభావం వ్యక్తంచేశాడు.
Read Also: వామ్మో.. ఒక్క సాంగ్‌కు శ్రియ అంత డిమాండ్ చేస్తోందా?
Follow us on: Google News, Koo, Twitter