ఐపీఎల్ అంటేనే సిక్సర్లు, ఫోర్లు.. బంతి బంతికి పోరాటం. మ్యాచ్ గెలిచేందుకు ఏ ఒక్క అవకాశం వచ్చినా వదులుకోవడానికి ప్లేయర్లు ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో గ్రౌండ్ లో ప్లేయర్స్ మధ్య గొడవలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్(CSK), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) మ్యాచ్ లో ఇదే జరిగింది. చెన్నై ప్లేయర్ జడేజా(Ravindra Jadeja).. హైదరాబాద్ ప్లేయర్ క్లాసెన్(Klaasen) మీద కోపంతో ఊగిపోయాడు.
జడేజా ఓవర్లో మయాంక్ అగర్వాల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడే క్రమంలో బాల్ జడేజా వైపు రావడంతో క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న క్లాసెన్ అడ్డుగా రావడంతో జడేజా క్యాచ్ పట్టలేకపోయాడు. దీంతో కోపంతో ఊగిపోయిన జడేజా(Ravindra Jadeja) క్లాసెన్ తో గొడవకు దిగాడు. చివరకి ధోని(MS Dhoni) వచ్చిన శాంతింపజేస్తే కానీ కూల్ అవ్వలేదు. వచ్చిన లైఫ్ ను సద్వినియోగం చేసుకోలేని మయాంక్ అదే ఓవర్లో స్టంప్ అవుటై పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు సిక్సర్లు నమోదు
Follow us on: Google News, Koo, Twitter