మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్(BRS) అధికారంలోకి వస్తే ఐదేళ్లలోనే ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్ర(Maharashtra)లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీఆర్ఎస్‌ను గెలిపించాలని కేసీఆర్ కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తే.. ప్రజల సమస్యలు తీర్చే బాధ్యత తాను తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో దళిత బంధు, రైతుబంధు అమలు చేస్తే, రైతు బీమా కల్పిస్తే, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తే తాను మహారాష్ట్రకు రానని చెప్పుకొచ్చారు.
రైతుల పరివర్తనే ముఖ్యమంటూ పునరుద్ఘాటించారు. రైతు సంఘాల నాయకులు వ్యవసాయ రంగానికి మార్గనిర్దేశం చేసి ముందుండి నడిపించాలని కోరారు. పాలక శక్తులు రైతుల ప్రయోజనాల పేరు చెబుతూ అంతర్జాతీయ, కార్పొరేట్ ఒత్తిళ్లకు లొంగిపోయాయని విమర్శించారు. దేశంలో మార్పు తెచ్చేందుకే బీఆర్ఎస్ పుట్టిందని.. అందుకోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని కేసీఆర్(CM KCR) తెలిపారు.
Read Also: ఒకే చీర ఇద్దరికి నచ్చింది..ఇంకేముంది.. డిష్యుం డిష్యుం
Follow us on: Google News, Koo, Twitter