Delhi BRS Party Office |దేశ రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించుకుంటుంది. ఇప్పటికే మహారాష్ట్రలో వరుస బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణం పూర్తిచేసింది. వచ్చే నెల 4వ తేదిన వసంత్ విహార్ లో నిర్మించిన పార్టీ ఆఫీసు(Delhi BRS Party Office)ను ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) ప్రారంభించనున్నారు. ఈనెల 27న జగరనున్న పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేయనున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయనున్నట్లు సమాచారం. కాగా నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా మినీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనుంది బీఆర్ఎస్(BRS). అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలిసారి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభలను నిర్వహించనుంది.
Read Also: జూబ్లీహిల్స్ అమ్నిషియా పబ్ రేప్ కేసులో కీలక మలుపు
Follow us on: Google News, Koo, Twitter