Rain Alert |ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విదర్భ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా మరాఠ్వాడ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని పేర్కొన్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. అటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అకాల వర్షాలతో రెండు రాష్ట్రాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వాలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Read Also: ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం
Follow us on: Google News, Koo, Twitter