వెన్నుపోటు రాజకీయాలు నమ్మవొద్దని ప్రజలకు సీఎం జగన్(CM Jagan) సూచించారు. అనంతపురం జిల్లా నార్సలలో జగనన్న వసతి దీవెన(Jagananna Vasathi Deevena) నిధులను విడుదల చేసిన అనంతరం బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పు చేయకుడదన్నదే తమ ధ్యేయమన్నారు. 8లక్షల తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్లను నేరుగా జమ చేస్తున్నామని తెలిపారు. చదువు విద్యార్థుల భవిష్యత్ తో పాటు కుటుంబ చరిత్రను కూడా మారుస్తుందన్నారు. వెన్నుపోటు పొడిచే వారిని, మాయమాటలు చెప్పేవారిని నమ్మకండని పేర్కొన్నారు. చంద్రబాబు(Chandrababu) జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను ఉద్దేశిస్తూ.. ఓ ముసలాయన ఇంటర్వ్యూ ఇచ్చారంటా? అది చూస్తే పంచతంత్ర కథలు గుర్తుకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలు తనకు మద్దతుగా నిలవాలని జగన్ కోరారు.
Read Also: ఏపీకి ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన
Follow us on: Google News, Koo, Twitter