బండి సంజయ్(Bandi Sanjay) బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో పోలీసులకు చుక్కెదురైంది. బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసుల దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం.. ఆ పిటిషన్ ను కొట్టేసింది. టెన్త్ హిందీ పేపర్ లీకేజీ స్కాంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో జైలు నుండి బెయిల్ పై బండి సంజయ్ బయటకి వచ్చారు. కాగా ఆ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసుల దాఖలు చేసిన పిటిషన్ ను హన్మకొండ కోర్టు కొట్టేసింది.
కాగా టెన్త్ పేపర్ లీక్ స్కాంలో రాజకీయ కక్షతోనే బండి సంజయ్ ను నేరస్తుడిగా చూపించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ స్కాంతో బండి సంజయ్ కు సంబంధం ఉన్నట్లు నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారని వారు పేర్కొన్నారు.
విచారణకు సహకరించాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులో మొబైల్ ను స్వాధీనం చేయాలని కోరడంపట్ల బండి సంజయ్(Bandi Sanjay) తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే మొబైల్ మిస్ అయ్యిందని పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఫిర్యాదు నమోదైందని చెప్పినప్పటికీ ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ కోర్టును తప్పుదోవపట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని న్యాయవాదులు వాదించారు. విచారణ అనంతరం బండి సంజయ్ బెయిల్ రద్దు పిటీషన్ ను హన్మకొండ న్యాయస్థానం కొట్టిపారేసింది.
Read Also: కాంట్రాక్టర్ విజయ్ సూసైడ్ పై స్పందించిన RSP
Follow us on: Google News, Koo, Twitter