Revanth Reddy |ఏప్రిల్ 30న ఒకేరోజు నాలుగు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారని.. వేరు వేరు తేదీల్లో ఈ పరీక్షలను జరిగేలా చూడాలని గతకొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, అసిస్టెంట్ ఇంజనీరింగ్(ఏఈ), జూనియర్ లైన్ మెన్ (జెఎల్ఎం) పరీక్షలు ఒకేరోజు ప్రభుత్వం నిర్వహిస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తీరా పరీక్షల తేదీ దగ్గర పడుతుండటంతో ఏ పరీక్షకు హాజరు కావాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.
ఈ క్రమంలో నిరుద్యోగుల సమస్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. ఒకేరోజు నాలుగు శాఖల పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వ అవివేకం విమర్శించారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఈ నిర్ణయం శాపంగా మారిందిందని దుయ్యబట్టారు. ఈ నాలుగు పోటీ పరీక్షల నిర్వహణ తేదీలను ప్రభుత్వం రీ షెడ్యూల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ అన్ని పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పించేలా ఈ విషయంలో సీఎం కేసీఆర్ తక్షణం జోక్యం చేసుకోవాలన్నారు.
Read Also: హరీశ్ రావు మాటలు వింటుంటే నవ్వొస్తుంది: రఘునందన్ రావు
Follow us on: Google News, Koo, Twitter