హీరో మహేష్ బాబు(Mahesh babu)కు సూపర్ స్టార్ క్రేజ్, దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) కు స్టార్ డైరెక్టర్ హోదా తెచ్చి పెట్టిన చిత్రం ‘పోకిరి’. 2006 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా అప్పటి టాలీవుడ్ రికార్డులన్నింటిని తిరగరాసింది. పండుగాడిగా మహేశ్ నటన అభిమానులను ఒక ఊపు ఊపేసింది. నేటితో ఆ చిత్రం విడుదలై సరిగ్గా 17 సంవత్సరాలు అయింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ #17yearsforGameChangingIHPokiri హ్యాష్ ట్యాగ్ తో ట్విటర్ లో పోస్టులు పెడుతున్నారు. మహేశ్ మేనరిజం, పూరి డైలాగులు చిత్రాన్ని ఓ రేంజ్ కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిద్దో వాడే పండుగాడు’.. ‘ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా?’ అనే డైలాగులు ఇప్పటికీ ఎక్కడోచోట మార్మోగుతూనే ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో పోలీసులుగా మహేశ్ బాబు(Mahesh babu) ఎంట్రీ అయితే వేరే లెవల్. ఆ ట్విస్టుకే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.