శనివారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ మ్యాచ్(DC vs SRH) సందర్భంగా గ్యాలరీలో అభిమానులు కొట్టుకున్నారు. మ్యాచ్ జరుగుతుండగా కొందరు ఫ్యాన్స్ పిడ్డిగుద్దులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఫ్యాన్స్ ఘర్షణ పడుతుండడం కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో కాసేపు అభిమానులు మ్యాచ్ చూడటానికి బదులు వీరి ఫైటింగ్ సీన్ ను తిలకరించారు. వీరి గొడవకు కారణం మాత్రం తెలిసిరాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మ్యాచులో హైదరాబాద్ జట్టు 9పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
A fight took place between fans in Delhi during their match against SRH. pic.twitter.com/MYPj6dqejb
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2023