తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

-

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని(New Secretariat) సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. తూర్పు గేటు నుంచి సచివాలయానికి వచ్చిన సీఎం(CM KCR)కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగ‌తం ప‌లికారు. తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రిబ్బన్ కట్ చేసి సచివాలయంలో అడుగుపెట్టారు. అనంతరం సెక్రటేరియట్(New Secretariat) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

- Advertisement -

అక్కడి నుంచి నేరుగా ఆరవ అంతస్తులోని తన ఛాబర్ కు వెళ్లిన కేసీఆర్ పోడు భూముల పంపిణీ ఫైలుపై తొలి సంతకం చేశారు. మొత్తం 6 ఫైళ్లపై కేసీఆర్ సంతకాలు పెట్టారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న కేసీఆర్ ను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు శాలువలతో సత్కరించారు. మరోవైపు మంత్రులు కూడా తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులయ్యారు. ఇవాళ ఉదయం నిర్వహించిన చండీయాగం, సుదర్శన యాగాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి(Prashanth Reddy) దంపతులు పాల్గొన్నారు.

Read Also: దేశంలోనే అతిపెద్ద కుంభకోణంలో KTR పాత్ర: రేవంత్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...