జగన్ కు షాక్ ఇచ్చిక సీబీఐ

జగన్ కు షాక్ ఇచ్చిక సీబీఐ

0
80

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది… ఇటీవలే ఆయన తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ కోర్టులో పిటీషన్ వేశారు… తాను రాజ్యంగా బద్దమైన విధులు నిర్వహిస్తున్నందున ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరు కాలేనంటూ తన న్యాయవాది తరపున పిటీషన్ వేశారు…

పిటీషన్ పై అక్టోబర్ 18న సీబీఐ కోర్టు ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా తన తీర్పును వెళ్లడించింది… కాగా జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడంవల్ల అతని కేసులు, సాక్షాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కోర్టు వాదనలు వినిపించింది…

జగన్ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగిందని అలాంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని అధికారులంతా ఆయన చెప్పినట్లు వినాల్సి వస్తోందని సీబీఐ దృష్టికి తీసుకువచ్చింది… అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ విజయసాయిరెడ్డి శ్రీలక్ష్మీ రాజగోపాల్ కూడా కోర్టుకు హాజరయ్యారు…