బీఆర్ఎస్ పేరు చెబితేనే మిగతా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు భయపడుతున్నాయని బిజెపి మహిళా నేత విజయశాంతి(Vijaya Shanthi) విమర్శించారు. ముందు ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో భారీగా డబ్బు పంపిణీ విధానాన్ని బీఆర్ఎస్ ప్రవేశపెట్టిందని ఆమె విరుచుకుపడ్డారు. రాజకీయ పార్టీలకు ఏం చేయాలో పాలు పోని స్థితిని కేసీఆర్ తీసుకువచ్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆమె సుదీర్ఘ పోస్టును పెట్టారు. ఇంతకీ ఆమె ఏమని రాసుకోచ్చారంటే…
మహారాష్ట్రలో ఒక చిన్న రైతు సంఘం ఎన్నికలకు కూడా కోట్ల రూపాయలు పంచి ఒక్క స్థానం కూడా గెలవక ఓడిపోయినప్పటికీ.. అదే స్థాయిలో ముందెన్నడూ అక్కడ లేని విధంగా ఇతర రాజకీయ పార్టీలు డబ్బు పంపిణీ చెయ్యవలసిన దుర్మార్గాన్ని తయారు చేసి,రేపటి రోజు దేశమంతా ఇదే భ్రష్టాచార వ్యవస్థను బీఆర్ఎస్ పేరుతో, తెలంగాణలో దోపిడీ చెయ్యబడ్డ లక్షల కోట్ల అవినీత ధన తోడ్పాటుతో దేశంలోని అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు మేమే భరిస్తామని కేసీఆర్ గారు వెళ్తున్న విధానం, మొత్తం భారత ప్రజాస్వామ్య వ్యవస్థనే అవహేళన చేసి, నియంతృత్వ ఫ్యూడల్ ధోరణికి దారి చేస్తున్న పరిస్థితి కావచ్చేమో అని తప్పక అనిపిస్తున్నది.
ఇది చాలదన్నట్లు ఏపీలో జనసేన వంటి పోరాడే పార్టీని కూడా వెయ్యి కోట్ల ప్రలోభంతో (జనసేన అసహ్యించుకుని స్పందించనప్పటికీ…) మోసగించి దెబ్బ తియ్యాలనే మీ ప్రయత్నం ఆంధ్రజ్యోతి వంటి అగ్రశ్రేణి దినపత్రికలలో వార్తలుగా వచ్చింది.ఇక అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే స్ఫూర్తితో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి మీ బీఆరెస్ కుటుంబం ఢిల్లీ, పంజాబ్‌లలో తెచ్చిపెట్టిన స్కాంల సమస్యతో ఆప్ అసలుకే నాశనమయ్యేట్లు అనిపిస్తున్నది నేటి.. రేపటి నిజం అంటూ విజయశాంతి(Vijaya Shanthi) ట్వీట్స్ చేసారు.
బీఆరెస్ పేరు చెబితే భయపడుతున్న మిగతా రాష్ట్రాల రాజకీయ పార్టీలు…
ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి… pic.twitter.com/0b4J96de7f
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 4, 2023
Read Also: సమాధానం చెప్పని డీజీపీ ఆఫీస్: రఘునందన్ రావు
Follow us on: Google News, Koo, Twitter