BRS Delhi Office |దేశ రాజకీయాల్లో మార్పు నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత్ రాష్ట్ర సమితిగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ నేడు ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మించిన పార్టీ భవనాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 4 అంతస్తుల్లో 1100 చదరపు అడుగుల్లో నిర్మించుకున్న పార్టీ ఆఫీస్ ను ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 1:05 గంటలకు రిబ్బన్ కట్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఫీస్ లోకి అడుగు పెట్టారు. ముందుగా ప్రాంగణంలో శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఎగురవేశారు.
BRS Delhi Office |2021 సెప్టెంబర్ 2 న పార్టీ ఆఫీస్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. ఆఫీస్ అండర్ గ్రౌండ్ ఫ్లోర్ లో కాంటీన్, రిసిప్షన్ లాబీ, కార్యదర్శుల ఛాంబర్లను ఏర్పాటు చేసారు. మొదటి అంతస్థులో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఛాంబర్, ఇతర ఛాంబర్లను తో పాటు మీడియా హాల్ ను ఏర్పాటు చేసారు. 2, 3 అంతస్తుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, వెంకటేశ్ నేత, కేశవరావు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అయితే, ఈ కార్యాలయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కేసీఆర్ తొలి సమావేశం నిర్వహిస్తారు.
Read Also: పొంగులేటితో ఈటల భేటీ పై బండి సంజయ్ రియాక్షన్
Follow us on: Google News, Koo, Twitter