ప్రపంచ క్రికెట్లో గౌతం గంభీర్, విరాట్ కోహ్లీ(Kohli Gambhir) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఒంటిచేత్తో గెలిపించిన మ్యాచ్‌లు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో గంభీర్ ఇన్నింగ్స్, 2022 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఎప్పటికీ నిలిచిపోతాయి. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు ముదిరాయి. 2013లో ప్రారంభమైన విభేదాలు.. మొన్న రీసెంట్గా జరిగిన లక్నోvsబెంగళూరు మ్యాచ్ వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. కొందరు కోహ్లీకి మద్దతు ఇస్తుండగా.. మరికొందరు గంభీర్‌కు సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఈ గొడవ జరగడానికి మ్యాచ్ జరుగుతున్నప్పుడు, మ్యాచ్ అనంతరం కొన్ని సంఘటనలు మాత్రం ఆజ్యం పోసినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
Kohli Gambhir |దీనికంటే ముందు ఏప్రిల్ 10వ తేదీని లక్నో(Lucknow Super Giants), బెంగళూరు(RCB) మధ్య జరిగిన తొలి మ్యాచ్ గురించి ముందుగా చెప్పుకోవాలి. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించిన అనంతరం.. ఆ జట్టు మెంటార్ గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్‌ను చూస్తూ ‘సైలెంట్‌గా ఉండండి’ అనే అర్థం వచ్చేలా అగ్రెసివ్‌గా ఓ సైగ చేశాడు. ఆర్సీబీ ఓడిపోయినప్పుడు ప్రత్యర్థులు చేసే కామెంట్లకు గానీ, సైగలకు గానీ.. మరో మ్యాచ్‌లో కోహ్లీ కచ్చితంగా బదులిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. లక్నోతో సోమవారం జరిగిన మ్యాచ్‌లోనూ అదే జరిగింది. లక్నో వికెట్లు కోల్పోయిన సందర్భాల్లో కోహ్లీ సంబురాలు చేసుకున్నాడు. అలాగే, గంభీర్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చేలా.. ‘సైలెంట్’ సైగను అనుకరించాడు. అలాగే, సిరాజ్ వేసిన 17వ ఓవర్లో చోటుచేసుకున్న ఘటన కూడా గొడవకు ఆజ్యం పోసింది. ఇది మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే వరకూ కొనసాగింది. ఈ గొడవలు ఇక్కడితో ఆగిపోతాయో లేక కొనసాగుతూనే ఉంటాయో చూడాలి.
Read Also: మహిళల మానసిక ఒత్తిడి తగ్గించే 3 సులువైన చిట్కాలు
Follow us on: Google News, Koo, Twitter