మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో A1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. దీంతో జూన్ 2వ తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో ఎర్ర గంగిరెడ్డి(Erra Gangireddy)ని చంచల్‌గూడ జైలుకు సీబీఐ అధికారులు తరలించారు. ఈ కేసులో A1గా ఉన్న గంగిరెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్ల కేసు దర్యాప్తునకు సహకరించేందుకు సాక్షులు ముందుకు రావడం లేదని.. అందుచేత బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్ రద్దు చేస్తూ మే 5లోపు సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీచేసింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఎర్ర గంగిరెడ్డి(Erra Gangireddy) ఇవాళ సీబీఐ కోర్టులో హాజరయ్యారు.
Read Also: జీవో నెం.1 పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter