హీరో నందమూరి తారకరత్న మన మధ్య నుంచి వెళ్లిపోయి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. ఆయన మరణవార్తను ఇప్పటికీ భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన బాధను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆమె రెండో పెళ్లి ఆలోచనలో ఉందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలపై అలేఖ్య పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. తారకరత్నతో ఉన్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆమె ఎమోషనల్ అయింది. ‘ఈ జీవితానికి నువ్వు .. నేను మాత్రమే.. నాకు జీవితానికి సరిపడా జ్ఞాపకాలు ఇచ్చి వెళ్లావు. వాటితోనే జీవితాంతం బతుకుతా.. నా చివరి శ్వాస వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ తెలిపింది. దీంతో ఆమె(Alekhya Reddy)కు రెండో పెళ్లి లాంటి ఆలోచనలు ఏమీ లేవని అర్థమవుతోంది. కాగా ఈ ఏడాది జనవరిలో గుండెపోటుకు గురైన తారకరత్న(Taraka Ratna) 23 రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాడుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Read Also: ఆకట్టుకుంటున్న ‘ఖుషీ’ మూవీ ఫస్ట్ సాంగ్ ప్రోమో
Follow us on: Google News, Koo, Twitter